ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలి – ప్రాజెక్ట్ అధికారి శ్రీ శుభం నోఖ్వాల్, ఐ.ఏ.ఎస్

పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి .నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జీ మే 21. పోలవరం జిల్లా చింతూరు మండలం స్థానిక ఐటిడిఏ చింతూరు సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ సెల్) కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఐటిడిఏ చింతూరు ప్రాజెక్ట్ అధికారి శ్రీ శుభం నోఖ్వాల్, ఐ.ఏ.ఎస్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా మొత్తం 61అర్జీలుస్వీకరించబడినట్లు తెలియజేస్తూ, వాటిని ఆన్‌లైన్ ద్వారా సంబంధిత శాఖలకు పంపించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా, సమగ్రంగా పరిశీలించి తక్షణ పరిష్కారం అందించడం అధికారుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ అర్జీలను హేతుబద్ధంగా పరిశీలించాలని సూచించారు. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని తెలిపారు.అదేవిధంగా ప్రతి బుధవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, గైర్హాజరైన పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో శ్రీమతి CH. రామతులసి (A.P.O-T.W), శ్రీ జి. మురళి (EE-TW), శ్రీ పి. దేవరాజు (DM, GCC), డా. యు. వెంకటేశ్వర్లు (అసిస్టెంట్ డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ)తో పాటు నాలుగు మండలాల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఎంపీడీవోలు తహసీల్దారులు, సిడిపిఓలు, ఎంఈఓ లు, , ఫారెస్ట్ రేంజ్ అధికారులు, ఏపిఎంలు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమానికి హాజరైన అర్జీదారుల కోసం పథక నిర్వహణ అధికారులు చల్లని మజ్జిగ పానీయాన్ని ఏర్పాటు చేయగా, ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *