ఫరూక్‌నగర్ మండల బేడ బుడగ జంగం సంఘం నూతన కమిటీ నియామకం

మండల అధ్యక్షుడిగా వానరసి స్వామి.. ఉపాధ్యక్షులుగా సదుల స్వామి, కప్పేరా అనిల్ కుమార్

పయనించే సూర్యుడు జూలై 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) బేడ బుడగ జంగం షాద్‌నగర్ తాలూకా అధ్యక్షుడు తూర్పాటి వెంకటేష్ ఆధ్వర్యంలో ఫరూక్‌నగర్ మండల బేడ బుడగ జంగం సంఘం సమావేశం నిర్వహించి నూతన మండల కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులకు ఘనంగా సత్కరించారు.నూతన కమిటీలో మండల అధ్యక్షుడిగా వానరసి స్వామి, ఉపాధ్యక్షులుగా సదుల స్వామి, కప్పేరా అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా సదుల ఆనంద్, కోశాధికారిగా సదుల నందులను నియమించారు.ఈ సందర్భంగా తూర్పాటి వెంకటేష్ మాట్లాడుతూ బేడ బుడగ జంగం సమాజ అభివృద్ధి, ఐక్యత, సంక్షేమం కోసం ప్రతి సభ్యుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంఘం బలోపేతానికి నూతన కమిటీ సమిష్టిగా పనిచేసి సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఈ సమావేశానికి సంఘం ముఖ్య నాయకులు వానరసి యాదయ్య, కళ్లెం ఉషయ్య, సదుల అంజయ్య, సదుల బాలకృష్ణ, సదుల పెంటయ్య, తూర్పాటి జంగయ్య, సదుల సత్యనారాయణ, సదుల యాదయ్య, కాలేం లింగం, తూర్పాటి దశరథ్, ఎన్. పెట్టయ్య, తూర్పాటి మల్లేష్, ఎస్. శ్రీశైలం, డి. లోకేష్, టి. పరశురాం, ఎస్. బిక్షపతి, టి. శ్రీశైలం, ఏం. మల్లేష్, వి. యాదయ్య, కే. జంగయ్య, కప్పేరా అంజయ్య, ఏం. యాదయ్య, బి. యాదయ్య, ఏం. నరసింహులు, ఏం. రాములు, కే. అంజి, ఎస్. సదానందం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *