భూముల వారసత్వ మార్పిడి నిబంధనలలో మార్పులు

​ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన తాజా ఆదేశాల ప్రకారం, పట్టా భూములు మరియు అసైన్డ్ భూములకు సంబంధించి వారసత్వ మార్పిడి ప్రక్రియను మరింత సులభతరంత చేశారు.

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూలై 06.07.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ// పాత పద్ధతి నిలిపివేత. ఎస్ జి. ఎస్ డబ్ల్యు స్మార్ట్ గవర్నెన్స్ విండో లో ఎఫ్ ఎం సి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ద్వారా నేరుగా కొత్తగా దరఖాస్తు చేసుకునే ము టే ష న్ సౌకర్యాన్ని నిలిపి వేశారు ​ఇది పట్టా భూములు మరియు అసైన్డ్ భూములు రెండింటికీ వర్తిస్తుంది. కొత్త విధానం – కేవలం రిజిస్ట్రేషన్ ద్వారానే.. ​ఇకపై వారసత్వానికి సంబంధించిన మ్యుటేషన్లు (మార్పిడులు) జరగాలంటే, ఖచ్చితంగా విభజన పత్రాలు/కుటుంబ విభజన పత్రాల రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే జరగాలి. ​ఒకవేళ వీలునామా రాయకుండా చనిపోయిన సందర్భాలలో , రిజిస్ట్రేషన్ అధికారికి సమర్పించాల్సిన పత్రాలలో (ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్) కూడా ఒక ముఖ్యమైన పత్రంగా ఉంటుంది. అసైన్డ్ భూములకు సంబంధించిన నియమాలు ​అసైన్డ్ భూములకు సంబంధించి, చట్టబద్ధమైన వారసుల మధ్య వీలునామా లేని వారసత్వ రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఉంటుంది. ​అయితే, ఈ అసైన్డ్ భూముల అమ్మకం/కొనుగోలు లావాదేవీలు జరగాలంటే మాత్రం, ప్రభుత్వం నిర్దేశించిన 20 సంవత్సరాల కాలపరిమితి ఖచ్చితంగా పూర్తి కావాలి. ఈ కొత్త మార్పులకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌లో తగిన మార్పులు చేయాలని మరియు రిజిస్ట్రేషన్ అధికారులకు శిక్షణ ఇవ్వాలని ఐజీఆర్ఎస్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. కాబట్టి ప్రజలు తమ భూముల వారసత్వ బదిలీల కోసం ఇకపై ఫ్యామిలీ పార్టిషన్ డీడ్స్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *