రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్కమిటీ కార్యదర్శిగా ముద్దంగుల తిరుపతి నియామకం..

పయనించే సూర్యుడు, జూలై 06 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ముద్దంగుల తిరుపతి ని నియమించారు. ఈ సందర్భంగా ఆయన నియామకం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముద్దంగుల తిరుపతి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఎఐసిసి కమిటీ సభ్యులు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహ రెడ్డి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ చైర్మన్ జెరిపాటి జైపాల్ తో పాటు తన నియమాకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నాయకురాలకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు, నాయకురాలకు శ్రేయోభిలాషులందరికీ ముద్దంగుల తిరుపతి కృతజ్ఞతలు తెలియజేసారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు విలువలకు కట్టుబడి రంగారెడ్డి జిల్లా ప్రజల అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు ప్రజల ఆశీస్సులు పార్టీ శ్రేణుల సహకారంతో తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *