మాజీ ముఖ్యమంత్రి రోశయ్య జయంతి ఘనంగా నిర్వహణ

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 5 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కె. రోశయ్య జయంతి వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సరళమైన జీవనం, నిబద్ధత గల రాజకీయం, పరిపాలనా దక్షతకు మారుపేరుగా నిలిచిన రోశయ్య గారి సేవలను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ముఖ్యమంత్రిగా గవర్నర్‌గా ఆర్థిక మంత్రిగా ఆయన రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయమని, యువతకు ఆయన జీవితం ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ వాసవి క్లబ్ మండల పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య సంఘం పెద్దలు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *