యాదవ చైతన్య వేదిక జిల్లా కార్యదర్శిగా పల్లెవేని అనిల్ కుమార్ యాదవ్

పయనించే సూర్యుడు జులై 7 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య :శంకరపట్నం మండలం పరిధిలోని గద్దపాక గ్రామానికి చెందిన పల్లెవేని అనిల్ కుమార్ యాదవ్‌ను యాదవ చైతన్య వేదిక కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర అధ్యక్షుడు గొర్ల ఐలేష్ యాదవ్ నియమించారు. యాదవులు, బీసీల సామాజిక, రాజకీయ చైతన్యానికి ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పరశురాములు, మండల అధ్యక్షుడు ఐలయ్య, గొర్ల కొమురయ్యలకు ధన్యవాదాలు తెలిపారు. యాదవులు, బీసీల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *