రెగ్యులర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం సమావేశం..

పయనించే సూర్యుడు జూలై 7, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ దుర్గా క్లినిక్ నందు రాష్ట్ర అధ్యక్షులు నిడమర్తి సత్తిరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల నూతన కార్యవర్గాలను ప్రకటించడం జరిగింది.. మొట్టమొదటిగా కాకినాడ డివిజన్ గాను నూతన కార్యవర్గాన్ని ఈ కిందివారిని నియమించడం జరిగింది . కాకినాడ మండల కార్యవర్గం అధ్యక్షులు:అభిబురెహమాన్ ఉపాధ్యక్షులు : పెదపూడి బాబి,కార్యదర్శి : బొండాడ శ్రీనివాస్,సహాయ కార్యదర్శి: షేక్ బషీర్ ,కోశాధికారి: కెవిఎన్ రావు ,గౌరవ అధ్యక్షులు: వై విష్ణు బాబు,గౌరవ సలహాదారులు :పలివెల చక్రవర్తి లను నియమించడం జరిగింది. వీరికి కాకినాడ బాధ్యతలను అప్పగిస్తూ అందరిని కూడా కలుపుకుంటూ సభ్యులందరు తో కలిసిమెలిసి ఉంటూ సంఘం యొక్క నియమ నిబంధనలను పాటిస్తూ సంఘానికి పాటుపడవలసిందిగా సంఘ అభివృద్ధి చెందుటకు ఉత్సాహంతో పని చేయవలసిందిగా వీరికి బాధ్యతలు అప్పగించడం జరిగింది . ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు పెనుమల ప్రసాద్ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామచంద్రరావు రాష్ట్ర కోశాధికారి డిఎల్ రాజు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి అలీషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బివి భాస్కర్, ఎస్.కె తనిషా కాకినాడ జిల్లా కార్యదర్శి మద్దూరి విజయ్ కుమార్ సహాయ కార్యదర్శి బివి భాస్కర్, కోశాధికారి బర్ల బాబ్జి , ఆర్గనైజింగ్ సెక్రటరీ నారాయణ సింగ్ ,కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షులు డి కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు తదానంతరం నూతన కార్యవర్గాన్ని అభినందించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *