పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జులై 08 మాడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం చింతలూరు గ్రామంలో బంజారా గిరిజనుల ఆరాధ్య దైవమైన శీతల భవాని మాతకు సాంప్రదాయబద్ధంగా ఘన పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం పెద్దపూస మొదటి మంగళవారం రోజున నిర్వహించే ఈ పండుగను గ్రామ గిరిజనులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శీతల భవాని మాతను ప్రత్యేకంగా పూజించి, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉండాలని, గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. సంప్రదాయ ఆచారాలు, పూజా కార్యక్రమాల నడుమ గ్రామంలో భక్తిశ్రద్ధల వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బానోత్ వనిత–రమేష్ నాయక్, బాపురావు నాయక్, రెడ్డి నాయక్, రాజు నాయక్, శ్రీనివాస్ నాయక్, సురేందర్ నాయక్, గంగాధర్ నాయక్, తిరుపతి నాయక్, బలరాం నాయక్, మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు, గిరిజనులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శీతల భవాని మాత ఆశీర్వాదాలు పొందారు.