వానాకాల వ్యాధుల నివారణపై అవగాహన గ్రామసభ

పయనించే సూర్యుడు జూన్ 07,(చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలంలోని అనంతసాగర్ గ్రామంలో రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో పరిశుభ్రతను పెంపొందించడం, సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టడం లక్ష్యంగా అనంతసాగర్ గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జడ ప్రమీల అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నిల్వ నీరు లేకుండా చూడడం, దోమల వ్యాప్తిని అరికట్టడం, తాగునీటి పరిశుభ్రతపై ప్రత్యేకంగా చర్చించారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో చింతకాని మండల పంచాయతీరాజ్ ఏఈ రఘు, ఇరిగేషన్ శాఖ ఏఈ రాంబాబు, గ్రామ ఉపసర్పంచ్ కడియాల లక్ష్మయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించిన అంశాలపై కూడా సమావేశంలో చర్చించి పలు సూచనలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *