వారాహి విద్యా వికాస్ స్కూల్‌లో చెస్ టోర్నమెంట్

విజేతలకు బహుమతుల ప్రదానం

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూన్ 2 గూడూరు పట్టణం, లోని వారాహి విద్యా వికాస్ స్కూల్ నందు “చెస్ కింగ్స్ అకాడమీ” ఆధ్వర్యంలో చెస్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. వారాహి స్కూల్ మేనేజ్‌మెంట్ చెస్ కింగ్ అకాడమీ శీను పర్యవేక్షించిన ఈ పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ​ఈ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా “ప్రగతి సేవా సంస్థ” అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ విచ్చేశారు. అనంతరం జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో ఆయన విజేతలకు బహుమతులను అందజేసి అభినందించారు. ​ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పి. మౌనిష్ మరియు ముఖ్య అతిథి కడివేటి చంద్రశేఖర్ పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడల్లో కూడా చురుగ్గా పాల్గొనాలన్నారు. చదరంగం లాంటి ఆటలు మేధో వికాసానికి ఎంతగానో తోడ్పడతాయని, క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని వారు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ ఇందిరాని, మరియు సిబ్బంది, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *