వైసిపి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ నిరసన కార్యక్రమం

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 05.06.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// మండల కేంద్రమైన చౌడేపల్లి లోని బస్టాండ్ లో గల దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ విగ్రహం వద్ద వైసిపి నాయకులు బాబు షూటి మోసం గ్యారంటీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా పలువురు వైసిపి నాయకులు ప్రసంగిస్తూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత అధికారంలో కి వచ్చినప్పుడు చేసిన వాగ్దానాలను విస్మరించాలన్నారు నిరుద్యోగ భృతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకులకు 50 సంవత్సరాలు దాటిన తర్వాత పింఛన్లు వంటి కార్యక్రమాలు తుంగలో తొక్కరన్నారు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీ సాయన్నారు మెగా డీఎస్సీ పేరుతో కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి నిరుద్యోగులను దగా చేశారని ఆరోపించారు అనంతరం ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ ఉపాధ్యక్షుడు నడింపల్లి దామోదర్ రాజు మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి నరసింహులు యాదవ్ రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి రుప్పినమ్మ రాష్ట్ర విద్యార్థి విభాగ సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్ బోయకొండ మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ భాస్కర రామనారాయణరెడ్డి పద్మనాభరెడ్డి మండల పార్టీ ఉపాధ్యక్షుడు జంగాలపల్లి వెంకటరమణ సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు రవిచంద్ర రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *