పయనించే సూర్యుడు ,జూన్ 06,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సారపాక మేజర్ గ్రామపంచాయతీ ఆఫీసు ప్రాంగణంలో సారపాక గ్రామపంచాయతీ సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ అధ్యక్షతన ఘనంగా పర్యావరణ దినోత్సవం. సారపాక మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్య నివారణ కొరకు చెట్లను నాటడం అత్యావశ్యకమని అన్నారు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా చెట్లను పెంచక పోతే మానవాళి మనుగడకు పెద్ద ముప్పు అని, ప్రభుత్వాలతో పాటుగా ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. వృక్షో రక్షతి రక్షితః చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్, గ్రామపంచాయతీ కార్యనిర్వాహణ అధికారి జి రవికుమార్, వార్డు మెంబర్లు మువ్వా వెంకటేశ్వరరావు(లడ్డ ), పాటి అశోక్, బూర్గంపహాడ్ కాంగ్రెస్ పార్టీ నేత పూలపెల్లి సుధాకర్ రెడ్డి ,ఇల్లంగి లాలయ్య, గుంటక శేషి రెడ్డి, మల్లి కృష్ణ, బర్మావత్ రాంబాబు, సాజిద్, లక్ష్మణ్, గ్రామపంచాయతీ కార్యాలయ సిబ్బంది, గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యనిర్వాహణాధికారి, పాలకవర్గ సభ్యులు మండల కాంగ్రెస్ నాయకులు మొక్కలు నాటడం జరిగింది.