పయనించే సూర్యుడు జూన్ 3 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక పదవులు(సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపాలిటీ) గడువు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే స్థానిక ఎలక్షన్ జరుపుటకు సన్నిద్ధమైనది, అందుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతనంలో రాష్ట్రంలో కూటమి నాయకులను పిలిపించి కార్యాలయం ఏర్పాటు చేయడమైనది, రాష్ట్రంలో నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రజల ఓటర్ కార్డు యాక్టివ్గా ఉన్నాయా లేవా అని చెక్ చేయాలి అని తెలిపినారు, అంతేకాదు 18 ఏళ్లు నిండిన ప్రతి కార్యకర్తలు ఓటర్ కార్డు అప్లై చేసుకోవాలని సూచించారు, ఇందులో గ్రామస్థాయి నుంచి మండల స్థాయి జిల్లాస్థాయి రాష్ట్రస్థాయిలో ప్రతి నాయకులు ప్రజల్లోకి వెళ్లి ఓటు హక్కు అవగాహన కల్పించాలని నాయకులకు సూచించారు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లో ప్రతి ఒక్కరూ యాక్టివ్గా పని చేస్తే కచ్చితంగా స్థానిక ఎలక్షన్లో 100% గెలుపుటకు కృషి చేసినట్లు అర్థం అవుతుంది, రాష్ట్రంలో అభివృద్ధిని మరియు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ నీ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది, మీ పనితీరును స్థానిక ఎలక్షన్లో చూపించికోవాలని సలహా సూచనలు ఇచ్చారు, పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం కష్టపడిన వారికి అధిష్టానం లో గుర్తింపు ఉంటుంది అని తెలిపినారు.