పయనించే సూర్యుడు: జూన్: 14/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె.విజయ బాబు సత్తుపల్లి నియోజకవర్గ సీఎం ఆర్ ఎఫ్ పెండింగ్ ఫైళ్లపై ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రత్యేక దృష్టి హైదరాబాద్లోని డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం ఆర్ఎఫ్) కార్యాలయంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన సీఎం ఆర్ఎఫ్ పెండింగ్ ఫైళ్లు మరియు రీ-వాలిడేషన్ ఫైళ్లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు సహాయం త్వరితగతిన అందేలా పెండింగ్లో ఉన్న ఫైళ్ల పురోగతిని సమీక్షించి, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు అందే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.