స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు ఘన నివాళులర్పించిన ఎస్.టి కమిషన్ చైర్మన్.

పోలవరం జిల్లా–రంపచోడవరం మండల కేంద్రం.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ జులై.05.2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,పోలవరం జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జయంతి,పింగళి వెంకయ్య వర్ధంతి,స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్.టి కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జి రెడ్డి.ఈ రోజు అల్లూరి సీతారామరాజు జయంతి,భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి,యువతీ,యువకులకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా.రంపచోడవరం ఎస్.టి కమిషన్ కార్యాలయం లో స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎస్.టి కమిషన్ చైర్మన్ శ్సోళ్ల బొజ్జి రెడ్డి మాట్లాడుతూ…అల్లూరి సీతారామరాజు గిరిజనుల హక్కులు,స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను అర్పించిన మహావీరుడని కొనియాడారు.రంపా ప్రాంతంలోని గిరిజనుల పై బ్రిటిష్ పాలకులు సాగించిన అన్యాయాలను ఎదిరిస్తూ…వారి ఆత్మగౌరవం కోసం సాయుధ పోరాటం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. గిరిజన యువతీ, యువకులు ఆయనను ఆదర్శంగా తీసుకుని ధైర్యం,దేశభక్తి,సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.పింగళి వెంకయ్య భారత జాతీయ జెండా రూపొందించి.దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా,ప్రతి భారతీయుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని పేర్కొన్నారు.జాతీయ పతాకం రెపరెపలాడే ప్రతి క్షణం పింగళి వెంకయ్య దేశభక్తి,త్యాగం ప్రతి ఒక్కరికీ గుర్తుకు వస్తాయని.ఆయన సేవల వల్ల భారతదేశ గౌరవం ప్రపంచవ్యాప్తంగా మరింత పెరిగిందని అన్నారు.స్వామి వివేకానంద యువతీ,యువకులలో ఆత్మవిశ్వాసం,దేశభక్తి,సేవాభావం,విలువలను పెంపొందించిన మహనీయుడని పేర్కొన్నారు.ప్రతి వ్యక్తిలో అపారమైన శక్తి దాగి ఉందని.ముందుగా తనను తాను తెలుసుకొని లక్ష్యసాధనకు కృషి చేయాలని ఆయన బోధించారని గుర్తుచేశారు.చికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసభలో భారతదేశ సంస్కృతి,ఆధ్యాత్మికత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని కొనియాడారు. ఈ ముగ్గురు మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, దేశాభివృద్ధికి, సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని సోళ్ల బొజ్జి రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గిరిజన నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు,స్థానిక ప్రజలు పాల్గొని స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు ఘన నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *