పయనించే సూర్యుడు జులై 5 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. బ్రిటీష్ పాలనపై వీరోచిత పోరాటం చేసి, గిరిజనుల హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన మన్యం వీరుడు, విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు అక్షయ అర్బన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం అదోనిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు బెస్త నాగరాజు మాట్లాడుతూ అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం సొసైటీ అధ్యక్షులు మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు దేశభక్తి, ఆయన ధైర్యసాహసాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కేవలం స్వాతంత్య్రోద్యమం మాత్రమే కాకుండా, అణగారిన వర్గాలు మరియు గిరిజనుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు.ఈ స్ఫూర్తితోనే తమ అక్షయ అర్బన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న నిరుపేదలకు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు, నైపుణ్య శిక్షణలు మరియు సామాజిక సేవలను నిరంతరం అందిస్తున్నామని స్పష్టం చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయాలను సాధించే దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు సుబ్రమణ్యం, గౌడ్ , కేశవ, రంగ రాజులు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
.
