ఎస్ బీ ఐ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు

పయనించే సూర్యుడు, జూలై 03, అశ్వాపురం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ స్థాపించి డెబ్బై సంవత్సరాలు అయిన సందర్భంగా డెబ్బై సంవత్సరాలు నిండిన పెన్షన్ దారుడు అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్ చేత అశ్వాపురం బ్యాంక్ మేనేజర్ దోష మనోజ్ కుమార్ కేకు కట్ చేయించారు ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ మా బ్యాంకు వచ్చే ఖాతాదారుల సేవ చేయటం నా అదృష్టంగా భావిస్తాను ప్రతిరోజు వందలాది మంది వస్తుంటారని ఏవైనా సమస్యలు ఉంటే నన్ను సంప్రదించవచ్చని తెలియజేశారు. సర్పంచ్ సదర్ లాల్ మాట్లాడుతూ పదవీ విరమణ సేవకు ముగింపు కాదు కొత్త అధ్యాయానికి అందమైన ఆరంభం నా జీవితంలో సుమారు ముప్పై ఎనిమిది సంవత్సరములు ఉద్యోగం చేశానని డెబ్బై ఏళ్లు దాటిన తర్వాత అశ్వాపురం గ్రామ ప్రజల చేసే భాగ్యం కలిగిందని అందుకు మా ప్రజలకు రుణపడి ఉంటానని తెలియజేశారు. నేను భారత ప్రభుత్వానికి సంబంధించిన భారజల కర్మాగారంలో పనిచేసినందున ప్రతి నెల, నెల పూర్తవకముందే కేంద్ర ప్రభుత్వము బ్యాంకులో పెన్షన్ జమ చేస్తుందని అందు మూలాన ప్రతీ నెల ఇక్కడే పెన్షన్ తీసుకుంటానని తెలియ చేశారు ఈ కార్యక్రమంలో పెన్షన్ దారుడు భారజల కర్మగార మాజీ అధికారి డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ, ఫీల్డ్ ఆఫీసర్ సాయి తేజ,ఫరీదీ బాబా ఇతరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *