అరకు ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఏర్పాటు చేయాలి – ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్

పయనించే సూర్యుడు న్యూస్ జూలై తేదీ 3 రూలర్ ప్రతినిధి బాసు అల్లూరి సీతారామరాజుజిల్లా అరకు నియోజవర్గ ఆదివాసీ ప్రాంతం ఏజెన్సీ ప్రముఖ కేంద్రమైన అరకులోయ ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ అరకువేలి వంద పడకల ఏరియా ఆసుపత్రిలో అనంతగిరి ,అరకువేలి,డుంబ్రిగూడ మండలాలతో పాటు ఒడిస్సా ప్రాంతం నుంచి వైద్యం కోసం అరకు ఏరియా ఆసుపత్రికి రోగులు వస్తున్నారని ప్రతిరోజు ఓపి సుమారు 400 ఉంటుందని శుక్రవారం, సోమవారం ఓపి 600 పైగానే ఉంటుందని అరకు ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అవసరమైన సర్జరీలు సమర్థవంతంగా నిర్వహించి చికిత్స అందిస్తున్నాప్పటికీ సిటీ స్కాన్ మిషన్ లేకపోవడం వలన పాడేరు జిల్లా ఆసుపత్రి, విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో పంపిస్తున్నారని అనంతగిరి,అరకువేలి, డుంబ్రిగుడ మండలాలతో పాటు సమీపంలో ఉన్న ఒడిశా రాష్ట్రం ప్రజలు వేలాది మంది ప్రజలకు అరకు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సిటీ స్కాన్ లేకపోవడం వల్ల బ్రెయిన్, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు ఇతర రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆదివాసీ ప్రాంతానికి తలమానికంగా ఉన్నా అరకు ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ మిషన్ ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *