గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని దుబ్బాక ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి హామీ

పయనించే సూర్యుడు జూలై 4 రాజేష్) దౌల్తాబాద్ మండలం మహమ్మద్ షాపూర్ గ్రామానికి చెందిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నా రెడ్డి సంపత్ రెడ్డి, దుబ్బాక ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని ఈరోజు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించి, గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా మహమ్మద్ షాపూర్ గ్రామంలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి అత్యవసరంగా అవసరమైన సీసీ రోడ్ల నిర్మాణం, కరెంటు పోల్స్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలను సానుకూలంగా పరిశీలించి, పరిష్కారం కోసం కృషి చేస్తానని దుబ్బాక ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలో మరిన్ని అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేపట్టాలని గ్రామ ప్రజల తరఫున కోరగా, తప్పకుండా సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చిన చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మహమ్మద్ షాపూర్ గ్రామ ప్రజల తరఫున అన్నా రెడ్డి సంపత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *