జులై 4న మిడ్జిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయండి: అరేళ్ళ యాదయ్య పిలుపు

పయనించే సూర్యుడు జులై 04 మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్ : జులై 4వ తేదీన జడ్చర్ల నియోజకవర్గం, మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహించనున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ‘రాజకీయ కృతజ్ఞత సభ’ను కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి విజయవంతం చేయాలని బాలానగర్ మండలం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ అరేళ్ళ యాదయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ భారీ బహిరంగ సభ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే భారీ బహిరంగ సభకు ఐక్యంగా కదలివచ్చి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలని, జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు శ్రేణులు ఈ సభకు భారీ సంఖ్యలో తరలిరావాలని అరేళ్ళ యాదయ్య పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *