ఉప సర్పంచ్ కుమార్తె వివాహ వేడుకలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పాల్గొనడం

పయనించే సూర్యుడు న్యూస్ జులై 4 సింగరేణి రిపోర్టర్ నరేష్ కారేపల్లి మండలం రేకులగూడెం గ్రామంలో ఉప సర్పంచ్ ఆవుల సత్యం గారి పెద్ద కుమార్తె వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి, నూతన దంపతుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, జిల్లా మరియు మండల స్థాయి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *