మరో మారు డిడిఎన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గా గుడి చంద్ర శేఖర్

పయనించే సూర్యుడు జులై 4 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) మెదక్ జిల్లా పెద్ద శంకరం పేట మండల కేంద్రానికి చెందిన ప్రముఖ పురోహితులు అర్చకులు అయిన గుడి చంద్ర శేఖర్ తెలంగాణ రాష్ట్ర డిడిఎన్ అర్చక సంఘం నకు ఉపాధ్యక్షులు గా మరో మారు నియమితులు అయ్యారు హైదరాబాద్ లో బొగ్గులకుంట తెలంగాణ సారస్వత పరిషత్ హలో లో బ్రాహ్మణ సంక్షేమ పరిషద్ చైర్మెన్ బసవరాజు శ్రీనివాస్ వీరిచే ప్రమాణ స్వీకారం గావించారు రాష్ట్ర స్థాయి అర్చకుల సేవకు గాను తనపై నమ్మకం తో ఉపాధ్యక్ష పదవి లో నియమించినందుకు గాను రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ మరియు మెదక్ జిల్లా అధ్యక్షులు శలాక రాజేశ్వర్ శర్మ ఈ సందర్భంగా గుడి చంద్రశేఖర్ ధన్యవాదములు తెలిపినానారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *