నిరుపేద బాలికకు వైద్య ఖర్చులకు ఆర్థికసాయం

పయనించే సూర్యుడు, జులై 04 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం, సారపాక గ్రామానికి చెందిన ముస్లిం ఎంపవర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (మేవా) వెల్ఫేర్ సొసైటీ. ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ మండలం సారపాక గ్రామపంచాయతీ రాజీవ్ నగర్ కు చెందిన షేక్. ఆయేషా పర్వీన్ (9) వైద్య ఖర్చులకోసం 10000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.కొంత కాలం క్రితం ఇంట్లో ఆడుకుంటూ కిందపడి కాలు విరగగా ఆపరేషన్ చేయాల్సి వస్తుందని ఆపరేషన్ కు లక్ష యాభై వేల రూపాయలు దాకా ఖర్చు అవుతుందని తెలుసుకున్న మేవా వెల్ఫేర్ కమిటీ సభ్యులు వారి కుటుంబ సభ్యులను ఓదార్చి రూ. 10000 వేల రూపాయలు ఆర్దిక సహాయం ను అందజేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కూలి పని మీద ఆధారపడినటువంటి నిరుపేద కుటుంబం అయినటువంటి ఆయేషా పర్వీన్ కుటుంబనికి వైద్య ఖర్చులు భారంగా మారాయి. విషయం తెలుసుకున్న మేవా కమిటీ సభ్యుల తీర్మానం మేరకు మావంతు చిన్న ఆర్థిక సహాయం చేశామని ఆమె త్వరగా కోలుకోవాలని ఆ అల్లా సుభానుతాలను వేడుకుంటున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో మేవా కమిటీ అధ్యక్షులు మహమ్మద్.ముస్తఫా. మొహమ్మద్ సోహెల్ పాషా. రెహమాన్. యూసుఫ్.మహమ్మద్ అజీజ్. అబ్దుల్ సలీం. తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *