సీతంపేటలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పరిశీలించిన సర్పంచ్ ఆళ్ల మణి-పానకాలరావు

పయనించే సూర్యుడు జులై 04, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని : చింతకాని మండలంలోని సీతంపేట గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఆళ్ల మణి-పానకాలరావు పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పంపిణీ చేస్తున్న ఎన్యూమరేషన్ ఫార్ముల పంపిణీ ప్రక్రియను పరిశీలించి, బీఎల్‌ఓ శ్రీనివాసరావుకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి ఓటరు తమ వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకుని, ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తిగా, సరైన సమాచారంతో నింపాలని సూచించారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాల రమేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కొత్తపల్లి బసవయ్య, కాంగ్రెస్ పార్టీ బూత్ ఇన్‌చార్జ్ కంచర్ల సైదులు, బయ్యన రాంప్రసాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మాధవరావు, జక్కుల వెంకటేశ్వర్లు, నారపోగు రోశయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *