మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129 వ జయంతి.

* అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవం నిర్వహించిన బిజెపి మండల అధ్యక్షులు కారం రామన్న దొర. * పోలవరం జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరు గ్రామపంచాయతీ పరిధిలో

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ జులై.05.2026 అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది అని భారతీయ జనతా పార్టీ దేవీపట్నం మండల అధ్యక్షులు కారం రామన్న దొర మాట్లాడుతూ….అల్లూరి సీతారామరాజు 1897.జూలై. 04 వ తారీఖున విశాఖపట్నం జిల్లా,పాండ్రంగి గ్రామంలో జన్మించినారు. బ్రిటిష్ వారి అడవీ చట్టాలను వ్యతిరేకిస్తూ…ఆదివాసీ గిరిజనులకు అండగా నిలిచారు.అల్లూరి సీతారామరాజు ఆయన నాయకత్వంలో ఆదివాసీ గిరిజనలు విల్లులు, బాణాలు,పాత తుపాకులతో పోలీస్ స్టేషన్ పై చింతపల్లి, అడ్డతీగల, రంపచోడవరం దాడులు చేశారు.బ్రిటిష్ ప్రభుత్వం అల్లూరి సీతారామరాజును పట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది.అల్లూరి సీతారామరాజు ఆచూకీ తెలిపిన వారికి రూ.10,000 (పది వేల రూపాయలు) బహుమతి కూడా ప్రకటించింది.అణగారిన ఆదివాసీ గిరిజనల హక్కుల కోసం “రంప తిరుగుబాటు” (1922-1924) నడిపాడు.గెరిల్లా యుద్ధ పద్ధతులతో బ్రిటిష్ పోలీస్ స్టేషన్లు పై దాడులు చేసి చివరకు 1924.మే.07 న చింతపల్లి అడవుల్లో ప్రాణాలర్పించారు.చరిత్రలో చిరస్మరణీయ మన్యం వీరుడుగా నిలిచారు.అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య సమయంలో గిరిజన హక్కుల కోసం పోరాడిన మహానీయుడు త్యాగం ధైర్యం దేశభక్తి ప్రతికగా నిలిచారు.ఆయన స్ఫూర్తి నేటి యువతీ,యువకులకు మార్గదర్శకంగా ఉండాలని.మన స్వాతంత్ర్యo మన ఆదివాసీ గిరిజన హక్కుల కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన విప్లవ వీరులకు శతకోటి వందనాలు అల్లూరి సీతారామరాజు ఆశయాలు ధైర్య సాహసాలు ఎల్లప్పుడూ మనకు స్ఫూర్తిగా నిలవాలి యువతీ,యువకులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి అయినాల వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు అరగంటి వీరభద్రా రెడ్డి,కార్యదర్శులు అరగంటి నాగి రెడ్డి, కెచ్చేల ముద్దుల, రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *