అర్ధరాత్రి తప్పిపోయిన బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన గజ్వేల్, జగదేవ్‌పూర్ పోలీసులు.

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ జులై 5 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలో ని జగదేవపూర్ మండలానికి చెందిన మైనార్టీ గురుకుల ప్రభుత్వం పాఠశాలలో శుక్రవారం అర్ధం రాత్రి తప్పి పోయిన విద్యార్థి ని వారి తల్లిదండ్రులకు సరక్షంగా అప్పగించిన పోలీసులు గజ్వెల్ జగదేవపూర్ పోలీస్ లవివరాలు ఇలా ఉన్నాయి శుక్రవారం రాత్రి గజ్వేల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, అర్ధరాత్రి సమయంలో ప్రాజ్ఞాపూర్ బస్ స్టాండ్ వద్ద ఒక బాలిక.వయసు 11ఒంటరిగా తిరగడం గమనించారు. వెంటనే అప్రమత్తమైన ఇన్‌స్పెక్టర్, బాలిక వద్దకు వెళ్లి వివరాలు విచారించారు. తనకు ఆ పాఠశాలలో చదువుకోవడం ఇష్టం లేక, పాఠశాల నుండి ఎవరికీ చెప్పకుండా బయటికి వచ్చేసినట్లు ఆ బాలిక తెలిపింది. రాత్రి సమయం కావడం, బాలిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇన్‌స్పెక్టర్ రవికుమార్ వెంటనే బాలిక గ్రామం పరిధి అయిన జగదేవ్‌పూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన జగదేవ్‌పూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి, బాలిక వివరాలను సేకరించి, వారి తల్లిదండ్రులను సంప్రదించి బాలికను సురక్షితంగా వారికి అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *