పయనించే సూర్యుడు జులై 5 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం పెద్దహుల్తి గ్రామంలో ఉల్తి కార్మంచి బండర మహోత్సవ పూజానికి దాదాపు 21 పట్టా కురుబ ఆరాధ్య దేవుళ్ళు కలిసి చేసే కురుబల పెద్ద పండుగ, ఈ పండుగకు ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామం గర్జలింగేశ్వర స్వామి మరియు దేవరాలు అయ్యమ్మ దేవి పట్టా దేవుళ్ళు సుమారుగా 800 భక్తులతో పాదయాత్రతో దాదాపు 60 కిలోమీటర్ దూరం ప్రయాణం చేయడం ఇది కలియుగంలో ఏనాడు లేని విధంగా ప్రయాణం చేయడం భక్తితో కూడిన ఒక సంకల్పం, భక్తితో ఏదైనా సాధించగలం అని నిర్పించుకున్న పెద్ద హరివాణం భక్తులు, కేవలం 10 గంటల్లో దేవుళ్లను మోసుకొని 60 కిలో మీటర్ల పాదయాత్రతో రావడం దైవభక్తి, భక్తి అంటే ఇలా ఉంటుందా అని దారిలో వస్తున్న గ్రామస్తులు కొనియాడారు, అలాగే మధ్యలో ఉన్న గ్రామ ప్రజలు దేవుళ్ళు మరియు భక్తులను చూసి వాళ్లు కూడా పూజ చేసి ఆశీర్వాదం తీసుకోవడం జన్మ ధన్యమైందని అన్నారు, 10 సంవత్సరం పిల్లల నుంచి 60 సంవత్సరాల పెద్దల దాకా ఇంటికి ఒకరు కుల మత బేదాలు లేకుండా ధర్మం భక్తి* అందరికీ ఒకటే దైవ అని భావించి పాదయాత్రతో పెద్దవూల్తి గ్రామానికి చేరుకున్న పెద్ద హరివాణం గర్జిలింగేశ్వర స్వామి మరియు దేవరాలు అయ్యమ్మ దేవి దేవుళ్ళు మరియు భక్తాదులు మధ్యలో భక్తులకు భోజనం ఏర్పాటు* చేసి దాహం లేకుండా చూసుకున్న మాన్వి దేవేంద్రప్ప.