ఆపదలో అండగా సీఎం సహాయ నిధి – లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

తాంబూరి దయాకర్ రెడ్డి చేతుల మీదుగా అందజేత

పయనించే సూర్యుడు న్యూస్, జూలై 7, సింగరేణి రిపోర్టర్ నరేష్ కారేపల్లి: అప్పాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని పలు కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను యువ నాయకుడు తాంబూరి దయాకర్ రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. ఆపద సమయంలో ప్రభుత్వ సహాయం పేద కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తూలిస్య తండాకు చెందిన లకావత్ ఆకాశ్, అప్పాయిగూడెంకు చెందిన ఎట్టి యర్రమ్మ, బిక్య తండాకు చెందిన భూక్యా తారలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. అనంతరం తాంబూరి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసాగా నిలుస్తోందని అన్నారు. నిరుపేదలు, ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు చేరేలా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎన్. నాయక్ పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం సహాయ నిధి ద్వారా అందిన ఆర్థిక సహాయం తమ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *