ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా – నిరుపేదలకు సొంత గృహ భరోసా

పయనించే సూర్యుడు జులై 7 రాజేష్ ) దుబ్బాక నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు గృహ భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి, రెవెన్యూ & గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ అవసరాలు తీర్చడంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పారదర్శకంగా అర్హులను గుర్తించి ఇళ్ల పట్టాలు అందజేస్తున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, తొగుట ఏఎంసీ మార్కెట్ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య యాదవ్, అక్బర్‌పేట భూంపల్లి ఏఎంసీ చైర్మన్ బొమ్మర సంయుక్త శ్రీధర్ గుప్తా, దౌల్తాబాద్ వైస్ చైర్మన్ మద్దెల స్వామి, తొగుట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంది రాజు, దౌల్తాబాద్ అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి, అక్బర్‌పేట గుండా శంకర్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ పడాల రాములు, జిల్లా కార్యదర్శి పద్మా రెడ్డి, ఎల్లన్న సురేందర్ రెడ్డి, సోలిపేట ప్రసాద్ రెడ్డి, మాజీ అధ్యక్షులు అక్కం స్వామి, బుస నిరంజన్ రెడ్డి, సాయి, బేగంపేట సర్పంచ్ చందు, రాంపురం రమేష్ తదితర కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *