
పయనించే సూర్యుడు బాపట్ల, జూలై 8: రిపోర్టర్( కే శివ కృష్ణ ) బాపట్ల జిల్లా కలెక్టరేట్ నూతన వీడియో కాన్ఫరెన్స్ హాలులో మై భారత్ కోర్ ప్రోగ్రామ్‌లు మరియు మై భారత్ పోర్టల్‌లో ఇంటెన్సివ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం అమలుపై జిల్లా సలహా కమిటీ, జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ డా. వి. వినోద్ కుమార్, ఐఏఎస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో మై భారత్, గుంటూరు డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి కిరణ్మయి దేవిరెడ్డి,సీసా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ CEO శ్రావణ్ కుమార్ నందలూరి వివిధ శాఖల జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బాపట్ల జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి మండలంలో అర్హులైన యువత మై భారత్ పోర్టల్‌లో నమోదు చేసుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని మరియు విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి ఇంటెన్సివ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ సూచించారు. యువతకు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ వికాసం, జాతి నిర్మాణంలో భాగస్వామ్యం వంటి అనేక అవకాశాలను మై భారత్ వేదిక కల్పిస్తోందని పేర్కొంటూ, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మై భారత్, గుంటూరు డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి కిరణ్మయి దేవిరెడ్డి మై భారత్ కోర్ ప్రోగ్రామ్‌లు, ఇంటెన్సివ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం లక్ష్యాలు, శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలను సమావేశంలో వివరించారు. ఈ సందర్భముగా మై భారత్ పోర్టల్ ఇంటెన్సివ్ రిజిస్ట్రేషన్ గోడ పత్రికలను ఆవిష్కరించారు