గంగపుత్ర మరాఠా సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ…

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 8 బోధన్ :బోధన్ పట్టణంలోని ఏక చక్ర నగర్ లో గల గంగపుత్ర మరాఠా సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను మంగళవారం అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాల నడుమ మహిళలు బోనాలు నెత్తిన ఎత్తుకుని కాలనీ నుండి మహాలక్ష్మి అమ్మ వారి ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుని బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర మరాఠా సంఘం అధ్యక్షులు గటుమల్ సాగర్, వార్డు కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డి, సభ్యులు సుభాష్, దశరథ్, తానాజీ, సీతారాం, గణేష్, దీపక్, పవన్, బాపూజీ మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *