విద్య సంస్థల బందును విజయవంతం చేయండి

*విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 8 బోధన్ :వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని పట్టణ కేంద్రంలో పోస్టల్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి అనిల్ ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుషాల్ దేవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు కావస్తున్న విద్యావ్యవస్థను బలోపేతం చేయకపోవడం అసమర్ధ పాలనకు నిదర్శనం విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడమే వారికి రియంబర్స్మెంట్ కాస్మోటిక్ ఛార్జీలు మెస్ బకాయిలను కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటు. అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్లను 27 వేల వరకు మూసివేస్తుందన్న నిర్ణయం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము ప్రభుత్వ పాఠశాలలను మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేదా రాష్ట్రవ్యాప్త ఉద్యమాలను నిర్మిస్తామని వారు తెలియజేశారు. ప్రతి ప్రైమరీ స్కూల్లో ప్లేన్ స్కూల్స్ ప్రీ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు ప్రభుత్వమే కల్పించాలని మధ్యాహ్నం భోజనాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఇంటర్ విద్యలో కూడా మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు తదితర అంశాల పైన ఈ ప్రభుత్వ విద్య వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ పదవ తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త బందును చేస్తున్నామని దీనికి ప్రైవేట్ మరియు ప్రభుత్వ విద్యా సంస్థల యజమాన్యాలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు గౌతం కుమార్ ఏఐఎస్బి జిల్లా అధ్యక్షుడు నాగరాజు ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు విశాల్ దేవ్ ఏఐఎఫ్డిఎస్ బోధన్ ఇన్చార్జి మోసిన్ నాయకులూ వరప్రసాద్, రాజన్న తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *