వైఎస్సార్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం.. రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్న 39వ వార్డు ఎరుకుల వీరేష్

పయనించే సూర్యుడు రిపోర్టర్ కర్నూలు జిల్లా క్రైమ్ రిపోర్టర్ ఎరుకుల మహేష్ ) ఆదోని పట్టణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 39వ వార్డుకు చెందిన ఎరుకుల వీరేష్ స్వచ్ఛందంగా రక్తదానం చేసి వైఎస్సార్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు.మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో వైఎస్సార్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాజ సేవే వైఎస్సార్ ఆశయమని, ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో రక్తదానం చేయడం ఎంతో గొప్ప సేవ అని పలువురు నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎరుకుల వీరేష్ మాట్లాడుతూ, ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున రక్తదానం చేయడం తనకు గర్వకారణమని అన్నారు. రక్తదానం వల్ల అవసరంలో ఉన్న రోగుల ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని, ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, వైఎస్సార్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం రక్తదానం చేసిన దాతలను అభినందిస్తూ వారి సేవా భావాన్ని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *