పంటల భీమా రైతుకు ధీమా

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జులై 09.07.2026 మదనపల్లి అన్నమయ్యజిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె నాగరాజ// పంటల భీమా రైతుకు భీమా వంటిదని పుంగనూరు వ్యవసాయ సంచాలకులు శివకుమార్ అన్నారు బుధవారం ఆయన స్థానిక ఆర్ఎస్కే కార్యాలయంలో రైతుల తో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ పుంగనూరు డివిజన్ పరిధిలోని మండలాలైన పుంగనూరు చౌడేపల్లి సోమల సదుం రైతులు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద వేరుశనగ టమోటా పంటలకు 15 జూలై 2026 వరకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద కంది రాగి పంటలకు 31 జులై 2026 వరకు వరికి 15 ఆగస్టు 2026 వరకు పంటల బీమా ప్రీమియం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు వేరుశనగ పంటకు ఎకరా భీమా రూ 28 వేలు రైతు చెల్లించాల్సింది కేవలం ఎకరాకు రూ 560లు అన్నారు అదేవిధంగా తక్కిన పంటలకు అవసరమైన ప్రీమియంను సంబంధిత ఆర్ఎస్కే కార్యాలయం వద్ద తెలుసుకుని చెల్లించాలని ఆయన కోరారు అదేవిధంగా చౌడేపల్లి పుంగనూరు ఆర్ఎస్కే ఇన్చార్జిల సమావేశం నిర్వహించి అన్ని పంటలను ఈ పంట డి సి ఎస్ క్రాప్ బుకింగ్ కింద నమోదు చేయాలని ఆదేశించారు రైతులందరూ పంటల బీమా పథకాలలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మోహన్ కుమార్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *