కల్లూరు మండలం లో ఘనంగా సుందరయ్య 41 వ వర్ధంతి

పయనించే సూర్యుడు: మే: 20/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె.విజయ బాబు కల్లూరు మండలంలోని యజ్ఞ నారాయణపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్ద సుందరయ్య గారి 41వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జెండా ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా వ్యవసాయ కార్యదర్శి సత్తుపల్లి డివిజన్ అధ్యక్షుడు తన్నీరు కృష్ణార్జునరావ్ మాట్లాడుతూ సుందరయ్య తన చిన్నతనం నుండి పేదల పక్షాన, రైతుల పక్షాన ,కార్మికుల పక్షాన నిలబడి పోరాడినటువంటి వ్యక్తిని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించారని అన్నారు .ఈరోజు పోరాడి సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆ స్థానంలో విబిజి రాంజీ బిల్లు తీసుకొచ్చిందని దీనితో కూలీలకు తీవ్ర నష్టం జరుగుతుందని, రెండుసార్లు ఫోటో తీసే విధానాన్ని రద్దు చేయాలని, రెండు వందల రోజులు ఉపాధి కల్పించాలని, అదేవిధంగా కూలి 600 రూపాయలు చేయాలని ఆయన అన్నారు. చెన్నూరు గ్రామంలో మండల కార్యదర్శి మాదల వెంకటేశ్వరావు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కల్లూరు పార్టీ కార్యాలయంలో డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు తన్నీరు కృష్ణార్జునరావు , ఐద్వా సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధి పని చేసే కూలీలకు అదేవిధంగా కల్లూరు బస్ స్టేషన్ లో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు వల్లెబోయిన రామనాథం, మనమంటి వెంకటి ,సామినేని హనుమయ్య, తన్నీరు కృష్ణవేణి, మండేపూడి చిన్న నాసరయ్య, తదితరులు పాల్గొని సుందరయ్య కి ఘన నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *