కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి

ఏ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్

పయనించే సూర్యుడు న్యూస్ మే 21 మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమేష్ పెట్రోల్,డీజిల్,గ్యాస్ పెంచిన ధరలు తగ్గించాలని ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరిచే విధంగా పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ ధరలను అమాంతం పెంచేయడం దుర్మార్గమన్నారు.పెట్రోలు, డీజిల్ రేట్లు పెరగడం వలన రవాణా చార్జీలు పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశానంటే ప్రమాదం ఉందన్నారు. రోజువారి ఖర్చులు పెరిగి సామాన్య ప్రజల బతుకు భారంగా మారి అర్ధాకలితో అలమట్టించే రోజులు పునరావృత్తం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు చాలీచాలని జీతాలతో బతుకుతున్న ప్రజలపై భారాలు మోపే ప్రభుత్వాలను గద్దె దింపితే తప్ప ప్రజల బతుకులు మారవన్నారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి అధిక ధరలను నియంత్రించి ప్రజలపై భారాలు తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శంకర్ డిమాండ్ చేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *