ఐటిఐ లో అడ్మిషన్లు ప్రారంభం

పయనించే సూర్యుడు-23-05-2026-రాజంపేట న్యూస్ : రాజంపేట లోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ రామమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదవ తరగతిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని, రాజంపేట ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, కంప్యూటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో iti.ap.gov.in పోర్టల్ లో నమోదు చేసుకోవాలని తెలిపారు. నమోదు చేసుకున్న వారు వారి సర్టిఫికెట్లను దగ్గరలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. జూన్ 30వ తేదీ నాటికి ఈ ప్రక్రియ ముగుస్తుందని, అనంతరం ప్రభుత్వం తెలిపిన తేదీల ప్రకారం కడపలోని ప్రభుత్వ మైనారిటీ ఐటిఐ లో నిర్వహించే కౌన్సిలింగ్ కు హాజరుకావాలని సూచించారు. విద్యార్థులు సాంకేతిక రంగంలోని ప్రధానమైన కోర్సులను ఎంపిక చేసుకుని బంగారు భవితకు బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *