ములుగు పరిధిలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న ముఠా అరెస్ట్: ఆరు టిప్పర్లు, ఒక హిటాచీ సీజ్

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మే 23గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలోని ములుగు మండల కేంద్రమైన పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ బృందం, ములుగు పోలీసులు ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మోరము తరలిస్తున్న వ్యక్తులపై మెరుపు దాడి చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు ములుగు మండలం కొక్కొండ గ్రామంలోని ప్రభుత్వ భూమి నుండి అనుమతులు లేకుండా గ్రావెల్‌ను తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను ములుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో మోరముతో నిండి ఉన్న 6 టిప్పర్ వాహనాలు తవ్వకాలకు ఉపయోగిస్తున్న ఒక హిటాచీ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ వివరాలు అరెస్ట్ అయిన నిందితుల 1.గంట ఇంద్రసేన (37), తండ్రి: రాములు, నివాసం: మామిడ్యాల, ములుగు. 2.దర్శనం కరుణాకర్ (25), తండ్రి: రాజయ్య, నివాసం: ములుగు. 3.రాజేందర్ పాశ్వాన్ (24), తండ్రి: శ్రీపతి పాశ్వాన్, నివాసం: ములు గు (స్వస్థలం: జార్ఖండ్). 4.సల్లూరి మల్లికార్జున్ (27), తండ్రి: సత్తయ్య, నివాసం: బంగ్లావెంకటాపూర్. 5.కుంటబోయిన వీరేశం (24), తండ్రి: తిరుపతి, నివాసం: బంగ్లావెంకటాపూర్. 6.కర్రె దినేష్ (25), తండ్రి: రాములు, నివాసం: గజ్వేల్. స్వాధీనం చేసుకున్న ఆస్తి: 6 టిప్పర్ వాహనాలు (నెంబర్లు: TS 07 UB 8343, TS 36 T 3711, TS 36 T 5698, TS 08 UG 4245, TS 36 T 6304, TG 12 T 1988). 1 టాటా హిటాచీ వాహనం. ప్రభుత్వ ఆస్తులను, భూములను అక్రమంగా తవ్వి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ములుగు ఎస్ఐ రఘుపతి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *