అధికార పార్టీ త్రాగు నీటి సమస్య గాలికి వదిలేస్తే, అక్కున చేర్చుకొని దాహార్తి తీర్చిన ప్రతిపక్షం

శాశ్వత త్రాగునీటి అందించలేక కూటమి ప్రభుత్వం విఫలం, బుట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్రాగునీటి సరఫరా

పయనించే సూర్యుడు మే 23, 2026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ గోనెగండ్ల మండల పరిధిలోని గంజహళ్లి, అగ్రహారం గ్రామాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొనడంతో గ్రామ ప్రజలు వేసవి తాపానికి తట్టుకోలేక తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని గంజాహళ్లి గ్రామానికి చెందిన వడ్ల నరసింహ ఆచారి, దాసన్న రమేష్ , అగ్రహారం గ్రామ మాజీ సర్పంచ్ రంగారెడ్డి , వెంకటేష్ , జయరాం , ఎలీషా , మణి , శేఖర్ , రాజు తమ గ్రామాల్లో ఎదుర్కొంటున్న త్రాగినీటి సమస్యను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుకమ్మ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల సమస్యల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే బుట్టా రేణుకమ్మ వెంటనే స్పందిస్తూ ఈ విషయాన్ని ఆమె భర్త,బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల కష్టాలను తెలుసుకున్న వెంటనే స్పందించి, మానవతా దృక్పథంతో బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంజహళ్లి, అగ్రహారం గ్రామాలకు మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేపట్టించారు. దీంతో గ్రామ ప్రజలకు తాత్కాలిక ఉపశమనం లభించిందని గ్రామ ప్రజలు హర్షంవ్యక్తం చేశారు. ఎండాకాలంలో తాగునీటి కోసం అల్లాడుతున్న సమయంలో తమ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు ముందుకొచ్చిన, బుట్టా రేణుకమ్మ సేవా కార్యక్రమాలతో ప్రజలకు అండగా నిలుస్తున్న బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ కు గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యమవుతూ సేవా కార్యక్రమాలు కొనసాగించడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *