బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం

* రోడ్డు ప్రమాదాల భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలి * జిల్లా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య

పయనించే సూర్యుడు న్యూస్ మే 23 నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బోధన్ డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతి పై నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సమగ్ర సమీక్ష సమావేశం చేపట్టారు. ఈ సమావేశంలో బోధన్ డివిజన్ ఏసీపి సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్హెచ్వోలు ఎస్సైలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సమావేశం ప్రారంభంలో రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు బక్రీద్ పండుగ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించాలని , చెక్ పోస్ట్ ల తనిఖీలు 24/7 తనిఖీలు చేయాలని , వాహనాల తనిఖీలు మరియు చెక్ పోస్ట్ ల వద్ద సిబ్బంది అలసత్వం పనికిరాదని తెలిపారు.బోధన్ డివిజన్ పరిధిలో నమోదైన వివిధ రకాల కేసులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా హత్య హత్యాయత్నం చోరీలు మహిళలపై నేరాలు సైబర్ మోసాలు డ్రగ్స్ మరియు గంజాయి అక్రమ రవాణా పేకాట గుట్కా అక్రమ వ్యాపారం వంటి కేసులపై ప్రత్యేకంగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అలాగే నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని రౌడీషీటర్లుపాత నేరస్తులు బెయిల్‌పై విడుదలైన వారిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పహారా వ్యవస్థను మరింత బలోపేతం చేసి అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాల తనిఖీలను కట్టుదిట్టంగా నిర్వహించాలని తెలిపారు. బోధన్ సబ్ డివిజన్ మహారాష్ట్ర సరిహద్దు వరకు ఉన్నందున అక్కడి నుండి ఇక్కడికి వచ్చి వెళ్లే వారిపై పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి అక్కడి పోలీసు సిబ్బందితో సత్సంబంధాలు మెరుగుపరచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని షీ టీమ్స్ ఈగల్ టీమ్స్ చీతా ఫోర్స్ వంటి ప్రత్యేక బృందాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమం లో బోధన్ ఏసిపి శ్రీనివాస్ సిటిసి ఏసిపి రాజశేఖర్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జి. మల్లేష్ సిసిఆర్బి ఇన్స్పెక్టర్ ఆర్.అంజయ్య సిఐలు ఎస్సైలు ఐటి కోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *