పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ హాజీ పి. వాహీదున్నిసా హఠాన్మరణం

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 23..05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరుు: నియోజకవర్గ 0 ప్రతినిధి జె. నాగరాజ// పుంగనూరు మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్ హాజీ పి. వాహీదున్నిసా ఈరోజు (శుక్రవారం, మే 22, 2026) ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, బెంగళూరులోని వైదేహి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ​ఆమె 1995 నుండి 2000 సంవత్సరం వరకు పుంగనూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సేవలందించారు. ఆమె పదవీకాలంలో పుంగనూరు పట్టణ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. నిగర్విగా, ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న హాజీ పి. వాహీదున్నిసా గారి మరణం పుంగనూరు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ​ఆమె హఠాన్మరణం పట్ల స్థానిక రాజకీయ నాయకులు, ప్రముఖులు మరియు పుంగనూరు మున్సిపల్ సిబ్బంది తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తమప్ర గాఢ సానుభూతిని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *