మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి

పయనించే సూర్యుడు, మే 24 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సెట్విన్‌ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డి శనివారం ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో, ముఖ్యంగా రహదారులు, భవనాల రంగాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ప్రజాసేవకే అంకితమైన ఆయన నాయకత్వం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుంటూ ప్రజాసేవలో నిరంతరం ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *