పయనించే సూర్యుడు న్యూస్ మే 25 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో సింగిల్ యూత్ ప్లాస్టిక్ ను అరికట్టే యంత్రాగం లేకపోవడంతో పరిసరాలు కాలుష్యంతో నింపబడుతున్నాయి ఏటా కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీలో జరుగుతున్నదని అందరికీ తెలిసిన సత్యం. ఏవరికి రావలసిన ముడుపులు వారికి అందుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందువలన ప్లాస్టిక్ వినియోగంపై పట్టించుకునే నాధుడే లేక పోవడంతో మార్కెట్లో ఎక్కడెక్కడ ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ టీ కప్పులు, ప్లేట్లు బడుతున్నాయి. కొన్ని పట్టణాల్లో మున్సిపాలిటీలో ఈ ప్లాస్టిక్ను నిరోధించడానికి అక్కడ అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటూ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికడుతున్నారు . అది ఏమి శాపమో తెలియదు కాని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో మాత్రం ఆదిశగా చర్యలు లేదన్నది స్పష్టమవుతుంది. సంవత్సరానికి ఒకటి రెండుసార్లు అధికారులు మార్కెట్ లో పలు దుకాణాలను తనిఖీలను చేసి జరిమానా వేస్తూ, ప్లాస్టిక్ గోదాములను సోధాలు తనిఖీలు చేసి సీజ్ చేస్తున్నప్పటికీ ఒక్క వారం రోజుల్లో తిరిగి అవి మార్కెట్లో . ప్రత్యక్షమవుతున్నాయి. అంటే ప్లాస్టిక్ పై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం, తూతూ మంత్రంగా దాడులు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం కాకమానదు. వ్యాపారులు తమ వ్యాపారాలను సాగించడానికి వినియోగదారులకు ప్లాస్టిక్ సంచులు ఇవ్వటం తో, వీటి వినియోగం ఈ ప్రాంతంలో పరిపాటిగా మారిపోయింది. వీటిని అరికట్టే భాగంగా ప్రజలు కూడా చైతన్యవంతులు కావలసిన అవసరం ఎంతైనా ఉంది. మున్సిపాలిటీలో కొత్తగా ఎక్కడ కట్టడాలు జరుగుతున్నాయన్న విషయంపై మున్సిపాలిటీ వారికి ఉన్న శ్రద్ధ , ఎక్కడ ప్లాస్టిక్ గోదాములు ఉన్నాయో తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీనీ ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా చేయటానికి అధికారులు నడుం బిగించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. “మున్సిపాలిటీలో ప్లాస్టిక్ ని అరికట్టి భావితరాలను ఇక్కడ ప్రశాంతంగా బ్రతకనిచ్చేటట్టు చేద్దాం”అన్న స్లోగన్ తో మనమంతా ముందుకు సాగి అధికారులకు చేయూతనిద్దాం.