ఆదోని మండలం-1లో కూటమి విజయభేరి మోగించాలి..

అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా గుడిసె ఆది కృష్ణమ్మ విస్తృత ప్రచారం. జనసేన జడ్పిటిసి అభ్యర్థి తాహిర్వలి,కపటి–నాగలాపురం ఎంపీటీసీ అభ్యర్థి పెద్ద లక్ష్మిని భారీ మెజారిటీతో గెలిపించాలి – గుడిసె ఆది కృష్ణమ్మ
🖨️ Print

పయనించే సూర్యుడు నవంబర్ 3 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఆదోని మండలం-1 పరిధిలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలను, స్థానిక నాయకులు, కార్యకర్తలను కలుసుకుంటూ కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి, వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గుడిసె ఆది కృష్ణమ్మ గారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు.గ్రామాల అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. ఆదోని మండలం-1 జడ్పిటిసి స్థానానికి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న తాహిర్ వలి ని, కపటి–నాగలాపురం ఎంపీటీసీ అభ్యర్థి . పెద్ద లక్ష్మి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కూటమి పార్టీల మధ్య ఉన్న ఐక్యత, సమన్వయమే మన బలమని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఒకే కుటుంబంలా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల సమష్టి కృషితో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారనే నమ్మకం తనకు ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేసి ఆదోని మండలం-1లో కూటమి జెండా ఎగురవేయాలని గుడిసె ఆది కృష్ణమ్మ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రంగస్వామి నాయుడు, మాధవ, దిబ్బనకల్ లక్ష్మన్న, బసవరాజు, దేవమని, ఎన్. శివకుమార్, జీవన్న, బాలస్వామి, సవరప్ప, రాజు, ఈరన్న, సౌరప్ప, మహదేవ, జగదీష్, శివ, తుకారం, గణేష్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *