బద్రవరంలో హోరెత్తిన కూటమి ఎన్నికల ప్రచారం

🖨️ Print

పయనించే సూర్యుడు న్యూస్.నవంబర్ 02(ఏలేశ్వరం మండలం రిపోర్టర్ ఏ శివాజీ):ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూటమి పార్టీల ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది.కూటమి జడ్పీటీసీ అభ్యర్థి పైలా సుభాష్ చంద్రబోస్,ఎంపీటీసీ అభ్యర్థి కాటుకపల్లి సీతారత్నం తో గ్రామంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు, మాజీ ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, లింగంపర్తి సొసైటీ అధ్యక్షులు పెంటకోట మోహన్, జనసేన నేత వరుపుల సాయి కిరణ్,తో
కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు, కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.గ్రామంలో అడుగడుగునా అపూర్వ స్పందన లభించింది.పలు ప్రాంతాల్లో మహిళలు అభ్యర్థులకు పూలమాలలు వేసి, హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ప్రజల నీరాజనాలు, కార్యకర్తల నినాదాలతో ప్రచార ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా పైలా సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తారని స్పష్టం చేశారు. కేంద్రం లో నరేంద్ర మోదీ, ముఖ్య మంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని అన్నారు.ఈ నెల 5వ తేదీన జరిగే జడ్పీటీసీ ఎన్నికలో ఏలేశ్వరం మండలం జడ్పీటీసీ గా నాకు కమలం గుర్తుపై, మరియు భద్రవరం ఎంపిటిసి అభ్యర్థి సైకిల్ గుర్తుపై, కూటమి బలపరిచిన అభ్యర్థులను ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలోకూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *