జిమ్నాస్టిక్స్ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం

🖨️ Print

పయనించే సూర్యుడు తేది 03-11-2026( మల్కాజ్గిరి ఇంచార్జి ప్రతినిధి డా. రఘుపతి ): జిమ్నాస్టిక్స్ పోటీల్లో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు సుమన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు, అధ్యక్షుడు ఎమ్. దుర్గా రావు, ఉపాధ్యక్షురాలు ఎమ్. హేమ శ్రీదేవి బహుమతులు ప్రదానం చేశారు. ఆల్ రౌండ్ ఛాంపియన్స్ విభాగంలో కర్ణాటకకు చెందిన షైవి పినాల్‌కుమార్ దేవ్ మొదటి స్థానం, కర్ణాటకకు చెందిన మహీక్ష మహేష్ పొలాస్ రెండవ స్థానం, తెలంగాణకు చెందిన చిల్కముక్కు డయానా గ్రేస్ మూడవ స్థానం సాధించారు. ఇండివిడ్యువల్ అపారేటస్ (వ్యక్తిగత విభాగం)లో బీమ్ విభాగంలో తెలంగాణకు చెందిన చిల్కముక్కు డయానా గ్రేస్ మొదటి స్థానం, అస్సాంకు చెందిన ఆరోహి కౌండల్ రెండవ స్థానం, మహారాష్ట్రకు చెందిన కేయా ప్రశాంత్ మూడవ స్థానం సాధించారు. అన్‌ఈవెన్ బార్ విభాగంలో కర్ణాటకకు చెందిన షైవి పినాల్‌కుమార్ దేవ్ మొదటి స్థానం, కర్ణాటకకు చెందిన దేవిషా చౌదరి రెండవ స్థానం, తెలంగాణకు చెందిన చిల్కముక్కు డయానా గ్రేస్ మూడవ స్థానం సాధించారు. విజేతలకు ఎమ్. దుర్గా రావు, ఎమ్. హేమ శ్రీదేవి బహుమతులు అందజేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *