
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 3 సింగరేణి రిపోర్టర్ నరేష్ నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించి, ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతి వ్యక్తికి నెలకు 12 కిలోల బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కారేపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ.. కరువు పరిస్థితులను ఆసరాగా చేసుకుని వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ సరుకుల ధరలు పెంచుతున్నారని ఆరోపించారు. బ్లాక్ మార్కెట్కు పాల్పడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి దుకాణంలో ధరల పట్టిక ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 200 రోజుల పని కల్పించి, రోజుకు రూ.800 కూలి చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు అందించాలని, కరువు నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.