3 లక్షల టెండర్లో 50 లక్షల గోల్మాల్వైసీపీ నేతల వెల్లడి..

పయనించే సూర్యుడు మే 28, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) రాష్ట్రంలో ఎక్కడా లేని టాక్స్ విధానం కాకినాడ నగరంలో కే టాక్స్ పేరుతో టీడీపీ నేతలు అమలు చేస్తున్నారని అలాగే, చిన్న క్రీడా మైదానం చదును చేయడానికి సంబంధించిన టెండర్లో 93 లక్షల విషయం 50 లక్షల రూపాయలు గోల్మాల్ జరిగిందని నగరానికి చెందిన వైసీపీ నేతలు వెల్లడించారు. ఈ గోల్మాల్ సొమ్ము, ఈ టాక్స్ల సొమ్మంతా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర రావు (కొండబాబు)కి వెళుతుందని పరోక్షంగా వారు విమర్శించారు. గురువారం కాకినాడ శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ వద్ద ఉన్న నగర వైసీపీ కార్యాలయంలో వైసీపీకి చెందిన స్థానిక నేతలు కాకినాడలో టీడీపీ వారు చేస్తున్న అక్రమాలు, కే ట్యాక్స్ వంటి అమలు తీరుపై వివరించారు. ఈ సందర్భంగా కాకినాడ నగర పాలక మాజీ కార్పొరేటర్, వైసీపీ నేత మళ్ళా కిషోర్ వెల్లడించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యేకు నెలకు ఒక కోటి 14 లక్షలు రూపంలో అవినీతి సొమ్ము చేరుతుందని వివరించారు. నగరంలో ఉన్న బ్రాందీ షాపుల ద్వారా ప్రతి బాటిల్ పైన పది రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని అలాగే ఆశీలు పాట ద్వారా కే టాక్స్, రేషన్ బియ్యం కొనుగోలు, జూదం నెంబర్ గేమ్లను ఆడించడం, సర్కు రవాణా చేసే బార్జీ ఉచితంగా చేసే రెన్యువల్కు లక్ష రూపాయలను అదనంగా వసూలు చేస్తున్నారని కిషోర్ వివరించారు. జగన్నాధపురంలోని ఎంఎస్ఎన్ చారిటీస్ క్రీడాస్థలం తమ హయాంలో ఉచితంగా చదును చేసామని చెప్పారు. అందులో మట్టి విషయంలో పాత ఇంటికి సంబంధించి మట్టితో అక్కడ ప్లాస్టిక్ కవర్లు వచ్చాయన్నారు. అంతేగాని ఆ మట్టి చెత్తాచెదారాలకు సంబంధించింది కాదని స్పష్టం చేశారు. దీనిపై తమ స్థానిక నాయకులు అప్పటి ఎమ్మెల్యే దృష్టికి తేగ తన సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని చెప్పారని ఈలోగా ఎన్నికలు రావడంతో అది చేయలేకపోయామన్నారు. అలా ఉచితంగా చదును చేయాల్సిన క్రీడా మైదానంకు టెండర్ పిలిపించడం 93 లక్షల గాను అందులో 50 లక్షలు అవినీతి చేతులు మారాయి అని చెప్పారు. ఈ సొమ్మంతా ఎమ్మెల్యే కె చేరిందని పరోక్షంగా వివరించారు. ఇక జగన్నాధపురం చిన్న మార్కెట్ మార్కెట్లో తాను కొన్ని దుకాణాలు తీసుకున్నానని వాటిని తన అనుచరులకి ఇచ్చి వ్యాపారం సాగిస్తున్నామంటూ అవగాహన లేకుండా తనపై అక్కడ స్థానిక నేతలు మాట్లాడుతున్నారన్నారు. వారిలో ఐదు దుకాణాలు వివిధ కారణాలు చేత చనిపోయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకి ఇచ్చి వారిని ఆదుకున్నట్లు కిషోర్ చెప్పారు. తనపైన, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపైన ఆధారాలు లేని ఆరోపణలు చేసి అభాసుపాలు అవ్వవద్దంటూ స్థానిక టీడీపీ నాయకులకు కిషోర్ హితబోధ చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు చక్క చక్రవర్తి, వాసిరెడ్డి చిన్ని, పృధ్వీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *