పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మే 30 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈరోజు న తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం పిలుపుమేరకు, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ( తాతయ్య) ఆదేశాల మేరకు పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య ఆధ్వర్యంలో కంఠమనేని ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన స్త్రీ శక్తి పర్చువల్ మహానాడు పండుగ గురువారంతో ఘనంగా ముగిసింది . స్త్రీ శక్తి మహానాడులో రెండవ రోజైన గురువారం కూడా భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు 103 వ జయంతిని పురస్కరించుకొని బైక్ ర్యాలీగా వెళ్లి గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహానాడు రెండో రోజు వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకలలో గ్రామంలోనే 6, 7వ క్లస్టర్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి హాజరైన తెలుగుదేశం కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య మహానాడు వేడుకలను దిగ్విజయంగా నిర్వహించారు. అలాగే రెండో రోజు జరిగిన మహానాడు వేడుకలలో విజయవాడ ఎంపీ. కేశినేని శివనాద్ (చిన్ని ) హాజరై కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెనుగంచిప్రోలు మండలంలోని పెనుగంచిప్రోలు నవాబుపేట గ్రామాల్లోని రెండు క్లస్టర్లో దిగ్విజయంగా మహానాడు వేడుకలను నిర్వహించిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్యను అభినందనలతో ముంచెత్తారు. పెనుగంచిప్రోలు గ్రామంలో జరిగిన మహానాడు కార్యక్రమంలో మొదటి రోజు సుమారు 1200 మంది కార్యకర్తలు హాజరవుగా రెండో రోజు గురువారం 1950 మంది కార్యకర్తలు హాజరై ఉంటారని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరైన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, మరియు చల్లటి పానీయాలు, మజ్జిగ, లస్సి ప్యాకెట్లను అందజేశారు. మొత్తంగా పెనుగంచిప్రోలు మండలంలోని రెండు గ్రామాల్లో జరిగిన మహానాడు వేడుకలను “న బూతే నా భవిష్యత్” అన్న చందంగా నిర్వహించిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్యను పార్టీ పెద్దలు, కార్యకర్తలు అభినందించారు