అక్రమ కట్టడాలు అరికట్టాలి.

ప్రభుత్వ భూముల అక్రమ కట్టడాలపై ఫిర్యాదు.చేసినందుకు గిరిజన మహిళా కుటుంబంపై దాడి. * బాధితురాలి ఆవేదన

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ ​మే.30.2026 వై.రామవరం మండల కేంద్రంలో నివసిస్తున్న.గిరిజన మహిళ లండ శారదాదేవి మరియు ఆమె కుటుంబ సభ్యులపై జరిగిన.ఘోరమైన భౌతిక దాడి ఘటనపై బాధితురాలు లండ శారదా దేవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.గత కొన్ని రోజులుగా ఈ విషయమై స్థానిక అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ.తమకు ఇంకా ఎలాంటి న్యాయం జరగలేదని ఆమె శుక్రవారం నాడు వై.రామవరంలో ఏర్పాటు.చేసిన విలేకరుల సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు.​అసలేం జరిగిందంటే బాధితురాలి కథనం ప్రకారం..వై.రామవరం మండల పరిధిలోని ప్రభుత్వ మరియు గ్రామకంఠం భూములలో కొందరు గిరిజనేతరులు (నాన్ ట్రైబల్స్) అక్రమంగా కట్టడాలు నిర్మించారు.ఈ అక్రమ కట్టడాలను తొలగించి ప్రభుత్వ భూములను కాపాడాలని బాధితురాలు గతంలో లోకాయుక్త మరియు ఉన్నతాధికారులకు సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు.దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు సదరు అక్రమ కట్టడాలను తక్షణమే ఖాళీ చేయించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు.​అయితే,ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేయాల్సిన స్థానిక రెవెన్యూ అధికారులు సదరు గిరిజనేతరులతో కుమ్మక్కయ్యారు.ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు గాను బాధితురాలిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు.ఇందులో భాగంగానే,బాధితురాలి జీవనోపాధి అయినటువంటి గ్యాస్ గోడౌన్‌ను ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు నిర్దాక్షిణ్యంగా సీజ్ (సీల్) చేశారు.​ఫిర్యాదు చేసినందుకు ప్రతీకారంగా దాడి.తమ జీవనోపాధిని దెబ్బతీసి,అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులతో పాటు,స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) పై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.దీనిపై తీవ్ర కక్ష పెంచుకున్న సదరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) ప్రణాళికాబద్ధంగా తమపై దాడికి వ్యూహం రచించారు.అని బాధితురాలు ఆవేదన వ్యక్తపరిచారు.​ఈ క్రమంలోనే,సదరు అధికారి ప్రోద్బలంతో అతని కుటుంబ సభ్యులు (ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు) మరియు కొందరు బయటి వ్యక్తులు పగటిపూట దౌర్జన్యంగా బాధితురాలి ఇంటిపైకి చొరబడ్డారు. బాధితురాలి భర్తను అసభ్య పదజాలంతో దూషిస్తూ…విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడ్డారు.చివరకు చిన్న పిల్లలను కూడా వదలకుండా వారిపై కూడా దాడి చేశారని.దానికి సంబంధించిన సాక్ష్యాలు బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇంట్లోని సెల్‌ఫోన్లను కూడా ధ్వంసం చేశారు.అని బాధితురాలు తెలియజేశారు. “అధికారులపైనే ఫిర్యాదులు చేస్తావా? మీ కుటుంబంలో ఎవరూ బ్రతకరు”అని బహిరంగంగా ప్రాణాపాయ బెదిరింపులకు పాల్పడ్డారు అని బాధితురాలు తన ఆవేదన ఉత్పరిచారు.అధికారులకు విన్నపం.ఈ ఘోరమైన దాడిపై ఆధారాలతో సహా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.చేసినప్పటికీ,దాడి చేయించిన వ్యక్తి ప్రభుత్వ అధికారి కావడంతో స్థానిక పోలీసులు కేసును పక్కదారి పట్టిస్తూ…బాధితురాలు అన్యాయం చేస్తున్నారని.తమకు కనీస రక్షణ కూడా కల్పించలేదని కుటుంబ సభ్యులు మీడియా ప్రతినిధుల ముందు వాపోయారు.ప్రస్తుతం తమ కుటుంబానికి తీవ్రమైన ప్రాణభయం పొంచి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బాధితురాలు ప్రధాన ​తమ కుటుంబం పై దౌర్జన్యంగా దాడికి పాల్పడిన సదరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) కుటుంబ సభ్యులపై మరియు దాడి చేసిన బయటి వ్యక్తులపై తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కోరారు.​తన అధికార బలంతో వెనుక ఉండి గిరిజన మహిళా కుటుంబంపై దాడి చేయించిన సదరు రెవెన్యూ ఇన్స్పెక్టర్‌పై (ఆర్ఐ) తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి,సస్పెండ్ చేయాలనీ,ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా,కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగా రెవెన్యూ అధికారులు అక్రమంగా సీజ్ చేసిన గ్యాస్ గోడౌన్‌ను తక్షణమే పునరుద్ధరించి,బాధితురాలు అధికారులను వేడుకున్నారు.బాధిత కుటుంబానికి మరియు వారి చిన్న పిల్లలకు తగిన పోలీస్ రక్షణ కల్పించి న్యాయం చేయాలి.ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్తు బృందం వారికి అండగా నిలిచింది.లండ శారదా దేవి. బాధితురాలు.వై.రామవరం మండలం,పోలవరం జిల్లా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *